న్యూ ఢిల్లీ: చత్తీస్ ఘడ్, నారాయణపూర్ జిల్లా చమేలీ గ్రామం ఆదివారం అర్ధరాత్రి నిర్మాణంలో ఉన్న రెండు బీఎస్ఎన్ఎల్ టవర్లకు మావోయిస్టులు నిప్పు పెట్టారు. ఆ తర్వాత బ్యానర్లు, పోస్టర్లను కూడా అక్కడ వేశారు. ఛోటాదొంగర్ పోలీస్ స్టేషన్కు 4 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం విశేషం. దీంతో ఆ ప్రాంతంలో జిల్లా పోలీసు బలగాలు, ఐటీబీ అధికారులు సోదాలు చేస్తున్నాయి. టవర్ను త్వరలో ప్రారంభించబోతున్నారని తెలిసి నక్సలైట్లు దానికి నిప్పుపెట్టారని భద్రతా బలగాలు తెలిపాయి. ఛోటెడోంగర్కు చెందిన పద్మశ్రీ వైద్యరాజ్ హేమచంద్ర మాంఝీని బ్రోకర్గా అభివర్ణించి దేశం నుంచి వెళ్లిపోవాలని బెదిరించారు. ఇప్పటికే హేమచంద్ర మాంఝీ మేనల్లుడు కోమల్ మాంఝీని నక్సలైట్లు దారుణంగా హత్య చేశారు. వైద్యరాజ్ హేమచంద్ర మాంఝీని బ్రోకర్ అని ఆరోపిస్తూ బెదిరిస్తున్నారు. దీంతో జిల్లా కేంద్రంలోని సేఫ్ హౌస్లో వైద్యరాజ్కు పోలీసు యంత్రాంగం భద్రత కల్పించింది