ముంబై : మహారాష్ట్రలోని గడ్చిరోలి నవెగావ్ అటవీ ప్రాంతంలో గురువారం పోలీసులకు, మావోయిస్టులకు మధ్య సాగిన ఎదురు కాల్పుల్లో ఎనిమిది మంది మావోయిస్టులు మరణించారు. వీరిలో అయిదుగురు మహిళలున్నారు. మృతి చెందిన మావోయిస్టుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఎదురు కాల్పుల అనంతరం అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.