ఛత్తీస్ గఢ్: సుకుమా జిల్లా మినపా అటవీ ప్రాంతం కాల్పుల మోతతో దద్దరిల్లింది. పోలీసులు, మావోయిస్టులకు మధ్య గురు వారం ఎదురు కాల్పులు సంభవించాయి. కాల్పుల్లో మహిళా మావోయిస్టు ఒకరు మృతి చెందారు. మృతురాలి నుంచి తుపాకీ, ఇతర సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.