రాయపూర్ : ఛత్తీస్గడ్ దంతరి అటవీ ప్రాంతంలో శనివారం సంభవించిన ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. ఖల్లారి -మెచ్కా గ్రామాల మధ్య అడవుల్లో గాలింపులు చర్యలు చేపట్టిన నక్సల్ వ్యతిరేక కార్యచరణ బృందంపై మావోయిస్టులు కాల్పులు చేసారు. పోలీసులు కూడా ఎదురు కాల్పులకు దిగారు. మృతుల్లో ముగ్గురు మహిళలని పోలీస్ అధికారులు తెలిపారు. సంఘటనా స్థలంలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు సమాచారం.