సుక్మా: బీజాపూర్ జిల్లా చిన్నచెందా అడవుల్లో తెలంగాణ గ్రేహౌండ్స్, మావోయిస్టులు మధ్య ఆదివారం రాత్రి జరిగిన భీకర ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. చిన్నచెందా అటవీ ప్రాంతంలోని పెసర్లపాడులో మావోయిస్టులు సమావేశమయ్యారు. దీన్ని తెలుసుకున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ గ్రేహౌండ్స్ ఆపరేషన్ చేపట్టారు. ఆదివారం రాత్రి నుంచి మావోల కోసం జల్లెడ పట్టారు. గ్రేహౌండ్స్ బలగాలు, మావోయిస్టులు ఒక్కసారిగా ఎదురుపడటంతో ఇద్దరి మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. మృతుల్లో చర్ల ఏరియా మిలీషియా కమాండర్ మధు ఉన్నారు. మొత్తం , నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలు మృతి చెందారు. మృత దేహాలను భద్రాచలం ఆస్పత్రికి తరలించారు.ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి.