కరోనా గేమ్‌లో బలైన చైనా..

కరోనా గేమ్‌లో బలైన చైనా..

కరోనా వైరస్ దెబ్బకి ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. ఆర్థికవ్యవస్థలు చిన్నాభిన్నమవుతున్నాయి. కొన్ని కంపెనీలు తాత్కాలికంగా మూతపడ్డాయి. కొన్ని కంపెనీలు అసలు శాశ్వతంగా మూతపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనంతటికి కారణం చైనా అని పలు దేశాలు ఆరోపిస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికా అయితే.. కరోనా వైరస్ సృష్టించింది చైనానే అనడానికి తమ వద్ద సాక్ష్యాలు కూడా ఉన్నాయని చెబుతోంది. రకంగా దాదాపు అన్ని దేశాలు చైనా వల్లనే పరిస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలా ఉంటే, ఎవరు తీసుకున్న గోతిలో వారే పడ్డట్టు.. కరోనా ప్రభావం చైనా ఆర్ధిక వ్యవస్థ మీద గట్టిగానే పడింది.మనం పది వస్తువులు కొంటే వాటిల్లో దాదాపు ఏడెనిమిది వస్తువులపైమేడ్ ఇన్ చైనాఅని రాసి ఉంటుంది. దీనినిబట్టే ప్రపంచ మార్కెట్ పై చైనా వస్తువుల ప్రభావం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. పిన్నీస్ దగ్గర నుంచి పెద్ద పెద్ద ఐటమ్స్ దాకా క్వాలిటీతో సంబంధం లేకుండా దాదాపు అన్ని ఐటమ్స్ తయారుచేసి ప్రపంచ దేశాల మీదకు వదులుతుంటుంది చైనా. కాస్ట్ కూడా అందుబాటులో ఉండటంతో ప్రజలు కూడా తెలిసో తెలియకో చైనా వస్తువులు కొంటుంటారు. దీంతో ఇన్నాళ్లు చైనా ఆటలు సాగాయి. అయితే ఇప్పుడు కరోనా గేమ్‌లో చైనా కూడా బలైంది.కరోనా దెబ్బకి నిత్యవసరాలు తప్ప అనవసర వస్తువులు కొనాలన్నా ఆలోచన ప్రజల్లో లేదు. ఒకవేళ కొనాలన్నా డబ్బులు కూడా లేవు. దీనికితోడు ఇప్పుడు దేశాలు కూడా వస్తువులు ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితిలో లేవు. ఇక చైనా నుంచైనా అసలు ఛాన్సే లేదు. అందుకే చైనాలో చాలా కంపెనీలు తాత్కాలికంగా మూతపడ్డాయి. ముఖ్యంగా గార్మెంట్స్, టాయ్స్ కంపెనీలు మూతపడ్డాయి. తయారుచేసినా కొనేవారు లేరు, వర్కర్స్ కి జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. దీంతో పలు కంపెనీలు తాత్కాలికంగా మూతపడ్డాయి. ప్రపంచ మార్కెట్ ని శాసించిన చైనాలోని కంపెనీలే మూతపడే పరిస్థితికి చేరుకున్నాయంటే, ఇలాంటి సమయంలో మన దేశం తీసుకునే ప్రతి నిర్ణయం, వేసే ప్రతి అడుగు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని నిపుణులు సూచిస్తున్నారు.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos