రాఫెల్ వల్లే పారికర్ చనిపోయారు

రాఫెల్ వల్లే పారికర్ చనిపోయారు

ముంబై : నిజాయితీ పరుడుగా పేరు తెచ్చుకున్న దివంగత గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందం వల్ల చనిపోయారని ఎన్సీపీ ఎమ్మెల్యే జితేంద్ర అవాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాఫెల్ ఒప్పందంలో చోటు చేసుకున్న అవినీతి గురించి ఏడాదిన్నరగా దేశమంతటా చర్చించుకుంటున్నారని, అయితే ఎవరూ పారికర్‌ను వేలెత్తి చూపలేదని గుర్తు చేశారు. అయితే అందులోని అవినీతి వల్ల ఆయన మానసికంగా చిత్రహింసలకు గురయ్యారని చెబుతూ, దీనివల్ల ఆయన కేన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడలేకపోయారని చెప్పారు. రక్షణ మంత్రిగా బాధ్యతలను నిర్వర్తించిన ఆయన మరో మారు గోవా ముఖ్యమంత్రిగా దుఃఖంతో వెళ్లారని తెలిపారు. రాఫెల్ ఒప్పందంలో చోటు చేసుకున్న అవినీతి వల్లే ఆయన తిరిగి గోవాకు వచ్చేయాలని నిర్ణయించుకున్నారని చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos