ఢిల్లీ : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు వెళ్లనున్నారు. ఆ రాష్ట్ర భాజపా నాయకుడు, రాజ్యసభ సభ్యుడు మదన్‌లాల్ సైనీ మరణించడంతో ఉప ఎన్నిక జరుగనుంది. ఈ స్థానం నుంచి మన్మోహన్ సింగ్‌ను నిలపాలని కాంగ్రెస్ గురువారం నిర్ణయించింది. ఆయన రాజ్యసభ సభ్యత్వం గత జూన్‌లో ముగిసింది. 28 ఏళ్ల పాటు రాజ్యసభ సభ్యుడుగా ఉన్నారు. అసోం నుంచి ఎన్నికవుతూ వచ్చారు. సైనీ గత ఏడాదే రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇప్పుడు రాజస్థాన్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. కనుక ఆ పార్టీ అభ్యర్థి ఎన్నిక కావడం దాదాపు ఖాయం. ఈ ఎన్నికకు ఈ నెల 7న నోటిఫికేషన్ వెలువడనుంది. అవసరమైతే ఈ నెల 26న ఎన్నిక జరుగుతుంది. అదే రోజు ఫలితాన్ని ప్రకటిస్తారు.