డిసెంబర్‌ 28 న మాజీ ప్రధాని మన్మోహన్‌ అంత్యక్రియలు

డిసెంబర్‌ 28 న మాజీ ప్రధాని మన్మోహన్‌ అంత్యక్రియలు

న్యూఢిల్లీ : మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ (92) అంత్యక్రియలు డిసెంబర్‌ 28న అధికారిక లాంఛనాలతో జరగనున్నాయి. దేశవ్యాప్తంగా ఏడు రోజులు సంతాప దినాలను నిర్వహిస్తున్నారు. సింగ్‌ భౌతికకాయం గురువారం అర్థరాత్రి ఎయిమ్స్‌ నుంచి మోతీలాల్‌ నెహ్రూ మార్గ్‌లోని ఆయన నివాసానికి తరలించారు. ప్రజలు అంతిమ నివాళులర్పించేందుకు ఆయన భౌతికకాయాన్ని ఉంచారు. సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, మల్లికార్జున్‌ ఖర్గే, రాహుల్‌ గాంధీ సహా పలువురు ప్రముఖులు నివాసానికి చేరుకొని నివాళులు అర్పించారు. డిసెంబర్‌ 28న జరగాల్సిన కాంగ్రెస్‌ వ్యవస్థాపక దినోత్సవంతో పాటు అన్ని కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు పార్టీ ప్రకటించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos