ముంబై : సినీ తారలను పెళ్లాడిన క్రికెటర్ల జాబితాలో యువ క్రికెటర్ మనీశ్ పాండే కూడా చేరబోతున్నాడు. దక్షిణాది నటి అర్షితా శెట్టిని పెళ్లి చేసుకోబోతున్నాడు. డిసెంబర్ 2న ముంబయిలో వీరిద్దరూ దంపతులు కాబోతున్నారని సమాచారం. ఎప్పటి నుంచో వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి. విజయ్ హజారే టోర్నీలో మనీశ్ కర్ణాటక జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. ముంబైకి చెందిన 26 ఏళ్ల అర్షిత తుళు భాషలో ‘తెళికెడా బొల్లి’ సినిమాతో 2012లో తెరంగేట్రం చేసింది. తర్వాత ‘ఉదయం ఎన్‌హెచ్4’ ద్వారా తమిళ పరిశ్రమకు పరిచయమైంది. కాగా మనీశ్, అర్షితల వివాహం అతి కొద్ది మంది బంధువులు, సన్నిహితుల మధ్య జరగనుందని తెలుస్తోంది. వెస్టిండీస్‌తో టీ20 సందర్భంగా డిసెంబర్ 2న టీమిండియా సభ్యులు ముంబయిలోనే ఉంటారు. వారంతా ఈ పెళ్లికి హాజరుకానున్నారు.