వరుణ్‌ గాంధీ సమర్థుడు

వరుణ్‌ గాంధీ సమర్థుడు

న్యూ ఢిల్లీ: ఉత్తరప్రదేశ్లోని పిలిభిత్ ఎంపీ వరుణ్ గాంధీకి బీజేపీ టికెట్ నిరాకరించడంపై ఆయన తల్లి మేనకా గాంధీ మరోసారి స్పందించారు. వరుణ్ గాంధీపై తనకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. ఈ విషయంలో పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు చెప్పారు. ‘పార్టీ నిర్ణయాన్ని నేను సవాల్ చేయలేను.. గౌరవిస్తాను. వరుణ్ గాంధీపై నాకు పూర్తి నమ్మకం ఉంది. వరుణ్ సమర్థుడు, తన వంతు కృషి చేస్తాడు’ అని మేనకా గాంధీ అన్నారు. కొందరు పార్లమెంట్ సభ్యులైతే.. మరికొందరు ఎంపీలు కాకుండానే రాజకీయ నాయకులుగా ఎదుగుతారని ఈ సందర్భంగా మేనకా గాంధీ వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్లోని పిలిభిత్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న వరుణ్ గాంధీకి ఈ ఎన్నికల్లో బీజేపీ టికెట్ నిరాకరించిన విషయం తెలిసిందే. పిలిభిత్ నియోజకవర్గం నుంచి వరుణ్ స్థానంలో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన జితిన్ ప్రసాదకు టికెట్ ఇచ్చింది. అయితే, ఆయన తల్లి మేనకా గాంధీకి మాత్రం మరోసారి అవకాశం కల్పించింది కమలం పార్టీ. యూపీలోని సుల్తాన్పూర్ నుంచి మేనకా గాంధీ మరోసారి బరిలో నిలిచారు. పిలిభిత్ నుంచి వరుణ్ గాంధీ 2009, 2019లో విజయం సాధించారు. ఆయన వరుసగా రెండుసార్లు బీజేపీ నుంచే గెలుపొందిన విషయం తెలిసిందే.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos