ఆరు నెలల్లో తేజస్వి యాదవ్ ప్రభుత్వం

ఆరు నెలల్లో తేజస్వి యాదవ్ ప్రభుత్వం

పట్నా: ‘మరో ఆరు నెలల్లో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుంటారు. ఆ తర్వాత విపక్ష నేత తేజస్వీ యాదవ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తార’ని అధికార జేడీయూ ఎమ్మెల్యే గోపాల్ మండల్ సంచలన వ్యాఖ్య చేసారు. గోపాల్ మండల్, బిహ్పూర్ ఎమ్మెల్యే ఇ.శైలేంద్ర మధ్య బుధవారం ఫోన్ లో జనరిగిన ఈ సంభాషణలో శుక్రవారం వెలుగు చూసింది. దీంతో ఒక్కసారిగా అధికార పార్టీలో కలకలం రేగింది. భాజపా జిల్లా అధ్యక్షుడు రోహిత్ పాండేపైనా మండల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఆడియోలో స్పష్టంగా వినిపించింది. భాగల్పూర్ నుంచి బరిలోకి దిగిన రోహిత్ పాండే కాంగ్రెస్ నేత అజీత్ శర్మ చేతిలో పరాజయం పాలయ్యారు. ‘నేను ప్రచారం చేసిన కూటమి అభ్యర్థులు విజయం సాధించారని రోహిత్కు చాలా పొగరు. అందుకే నేను ఆయన కోసం ప్రచారం చేయలేదు. అందుకే ఆయన ఓడిపోయార’ని పేర్కొన్నారు. ‘ఆ ఆడియో నాది కాదని మండల్ చెప్పారు. ఎమ్మెల్యే శైలేంద్ర ఈ ఆడియోను వైరల్ చేశారు. ఇదెక్కడి పద్ధత’ని ఆగ్రహించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos