కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు 69వ పుట్టినరోజు వేడుకలు మంగళవారం తిరుపతిలోని శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థలో ఘనంగా జరిగాయి.మోహన్‌బాబుకు శుభాకాంక్షలు తెలపడానికి సినీ,రాజకీయ ప్రముఖులు కార్యక్రమాలకు హాజరయ్యారు.మోహన్‌బాబు చిన్న కొడుకు మంచు మనోజ్ కూడా కార్యక్రమాల్లో హుషారుగా కనిపించాడు.సినిమాల్లో మాత్రమే కాకుండా నిజజీవితంలో కూడా పక్కింటి అబ్బాయిలో ఉండే మనోజ్ ఈ వేడుకలో విద్యార్థులను ఉత్సాహపరిచే విధంగా ప్రసంగించాడు. ముందుగా సినిమాల గురించి ప్రస్తావించిన మనోజ్ కొత్త చిత్రం ఎప్పుడు విడుదలవుతుంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారని నాన్న పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమా గురించి ప్రకటిస్తున్నానని జూన్ నెలలో తన కొత్త చిత్రం ప్రారంభం కానుందన్నారు.మీరచ్చిన కూడు తింటూ నేనెక్కిడి పోతానన్నా మీ దగ్గరికే వస్తా అంటూ అభిమానులను ఉద్దేశించి వ్యాఖ్యానించాడు మనోజ్.ఇక సమాజంలో జరుగుతున్న అరాచకాల గురించి ప్రస్తావిస్తూ..ఉగ్రవాదుల దాడులు,రాజకీయ హత్యలు,మహిళలపై దౌర్జన్యాలు వీటన్నింటిని చూస్తే ప్రతీ ఒక్కరికీ కోపం రావడం సహజం.ఇటువంటి ఘటనలపై వెంటనే సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌లు పెడతాం.అయితే ఈ ఆవేశం పోస్ట్‌లు పెట్టడం వరకే పరిమితం కాకూడదు.ఇటువంటి ఘటనలను నిలదీసేలా ఉద్యమించాలన్నారు.మనకు నచ్చిన నాయకుడికి ఓటు వేయమని అడగడంలో తప్పు లేదు కానీ నాయకుల గురించి తిట్టుకోవడం,కొట్టుకోవడం ఏంటని ప్రశ్నించాడు.ఓటు హక్కు వినియోగం ప్రాధాన్యత గురించి ప్రస్తావిస్తూ..ఈ మధ్యనే కొన్ని జంతువుల ధరల గురించి తెలుసుకున్నా.ఒక మంచిజాతికి చెందిన గేదె లేదా ఆవు ధర రూ.80వేల పలుకుతోంది, మేక ధర రూ.8వేలు పలుకుతోంది.చివరకు పంది ధర రూ.3 నుంచి రూ.5వేలు పలుకుతోంది.కానీ ఎన్నికల సమయంలో ఒక ఓటు ధర రూ.500 నుంచి రూ.5వేలు ఉంటోంది.అంటే అధికారం ఎవరిదో శాసించే ప్రజలు అంటే మనం పందుల కంటే హీనమా అంటూ ప్రశ్నించాడు.దీన్ని ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకొని డబ్బులకు అమ్ముడుపోకుండా ఓట్లు వేయాలంటూ సూచించాడు మనోజ్..