మా వాడిని వదిలెయ్ అన్నో..

  • In Film
  • May 21, 2020
  • 161 Views
మా వాడిని వదిలెయ్ అన్నో..

వివాదాస్పద వ్యాఖ్యలు,చేష్టలతో సినీమా,రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులకు చెమటలు పట్టించే దర్శకుడు రాంగోపాల్‌ వర్మ తాజాగా తారక్‌ పుట్టినరోజు సందర్భంగా తారక్‌ ఫోటోపై చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది.ఆరు పలకల దేహంతో కండలు తిరిగిన శరీరంతో ఉన్న తారక్‌ ఫోటోపై ఏం బాడీరా నాయనా అంటూ ఆర్జీవీ ట్వీట్‌ చేశాడు.తాను చూసిన శరీరాల్లో మియా మాల్కోవా తరువాత, అంతగా నచ్చిన శరీరం ఇదేనంటూ వర్మ కితాబిచ్చారు.దీంతో ఆర్జీవీ చేసిన ట్వీట్‌పై పెద్దసంఖ్యలో రీట్వీట్లు,కమెంట్లు వచ్చిపడ్డాయి.ఈ క్రమంలో ఆర్జీవీ ట్వీట్‌పై మంచు మనోజ్‌ స్పందిస్తూ.. మా వాడిని వదిలెయ్ అన్నో…” అంటూ ట్వీట్ పెట్టి, నమస్కార ఎమోజీని తగిలించి రామ్ గోపాల్ వర్మను వేడుకున్నాడు. ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos