
విజయవాడ:‘మంచు కుటుంబం అంటే ముంచే కుటుంబం’ అని ఆంధ్రప్రదేశ్ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు శనివారం ఇక్కడ మోహన్ బాబు పై మండిపడ్డారు. మోహన్ బాబు ప్రముఖుడి ముసుగు వేసుకున్న దొంగని దుయ్యబట్టారు. ఆయనకు కావాల్సింది ప్రముఖ వ్యక్తి హోదా. ధనికులతో పరిచయాలు.మూడో పేజీలో ప్రచారం మాత్రమేనని వ్యాఖ్యానించారు. ఫీజు రీయింబర్స్ మెంట్ గురించి వాస్తవాలు తెలియకుండా ఆరోపిస్తున్నారన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా అబద్ధపు ప్రచారాలు చేయొద్దని హెచ్చరించారు. దస్త్రాన్ని తీసుకుని రండి, బాకీ ఎంత ఉందో తెలుసుకుని మిగతా కళాశాలలతో బాటు పాటు ఇచ్చేస్తామన్నారు.. ధర్నాల పేరుతో విద్యార్థుల భవిష్యత్తును చెడగొడుతున్నారని దుయ్య బట్టారు. ముసుగు తీసేసి వైకాపా ప్రచారాన్ని చేసుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, మాయ చేసి జనాన్ని మూర్ఖుల్ని చేస్తున్నారని తప్పుబట్టారు. తనపై బురద జల్లడానికి ప్రయత్నించారని ఆరోపించారు. వాళ్లేదో ‘డిస్కవరీ ఆఫ్ ఇండియా’లా ప్రవర్తిస్తున్నారని ఎద్దేవా చేసారు. ‘ మోహన్ బాబు ఎంత పెద్ద నటుడో నాకు తెలియదు. పద్మశ్రీ బిరుదు ఇచ్చారు కాబట్టి పెద్ద నటుడే అయ్యి ఉంటారు. ద్మశ్రీ వచ్చిన మహా నటులు చాలా మంది ఉన్నారు. మోహన్ బాబుకు అది వచ్చినందుకు బాధపడుతున్నా. ఆయనకు డాక్టర్ రేట్ కూడా ఉందంటా అదైతే తనకు తెలియద’ని అవ హేళన చేసారు.