గాయపడ్డ కోతి కోసం కారు పంపింది ..

గాయపడ్డ కోతి కోసం కారు పంపింది ..

గాయాలతో కదల్లేని స్థితిలో రోడ్డు పక్కన పడి ఉన్న కోతికి సత్వర చికిత్స అందించేందుకు ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి  మేనకా గాంధీ కారు పంపించారు. విషయం తెలిసిన నెటిజన్లు ఇప్పుడామెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఢిల్లీలోని రైసినా రోడ్డులో కోతి తీవ్ర గాయాలతో రోడ్డుపై పడి కదల్లేకపోతోంది. గమనించిన జర్నలిస్టు దానిని ఫొటో తీసి తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు. కోతి తీవ్రంగా గాయపడి కదల్లేకపోతోందని, ఎన్జీవోలు కానీ, జంతు హక్కుల కార్యకర్తలు కానీ ముందుకొచ్చి దానికి చికిత్స అందించి కాపాడాలని కోరాడు. జంతు హక్కుల కార్యకర్త అయిన మేనకాగాంధీని ట్యాగ్ చేశాడు. ట్వీట్ చేసిన వెంటనే మేనకా గాంధీ స్పందించారు. కోతిని కాపాడేందుకు వెంటనే తన కారు పంపారు. విషయాన్ని అతడికి ట్వీట్ చేశారు. తనను ట్యాగ్ చేసినందుకు అతడికి ధన్యవాదాలు తెలిపారు. తాను కారు పంపించానని, మరికొన్ని క్షణాల్లో కారు అక్కడికి చేరుకోబోతోందని మేనక పేర్కొన్నారు. ట్వీట్ కాస్తా వైరల్ అవడంతో మేనకపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos