ఇంట్లో ఎలుకలు,బొద్దింకల సమస్య ఎక్కువగా ఉంటే ఎవరైనా వాటిని పట్టుకోవడానికి లేదా చంపడానికి రకరకాల మార్గాలు అనుసరిస్తుంటారు. కొంతమంది స్ప్రేలు వాడితే మరికొంత మంది బోన్లు తదితర వాటిని వాడతారు.అయితే బ్రెజిల్‌లో ఓ వ్యక్తి తన ఇంట్లో బొద్దింకల బెడదను అరికట్టడానికి చేసిన ప్రయత్నం అతడి ప్రాణాల మీదకు తెచ్చింది.ఇంటి ఆవరణలో గుంతలో ఉన్న బొద్దింకలను చంపడానికి ఆ వ్యక్తి చేసిన ప్రయత్నం సదరు వ్యక్తితో పాటు చుట్టుపక్కల నివసిస్తున్న వారిని కూడా భయభ్రాంతులకు గురి చేసింది.ఈ తతంగం మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది..