కామపు పొరలు కమ్ముకుకుంటే మనుషులు పశువుల్లా మారతారనే దానికి చెన్నై నగరానికి చెందిన యువకుడు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తున్నాడు. ప్రేమించిన అమ్మాయితో పాటు చిన్నమ్మ,బంధువులు చివరకు తన తల్లి అశ్లీల ఫోటోలను సైతం సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు.తమిళనాడు రాష్ట్రం పెరియ కాంచీపురం మల్లిగై వీధికి చెందిన మహ్మద్ గయాస్ (27) పెరంబదూర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తున్నాడు. చెన్నై ట్రిప్లికేన్‌లో ఇల్లు అద్దెకు తీసుకుని సుమతి అనే యువతితో కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్నాడు.ఈ కారణంగా సుమతితో కలిసి అప్పుడప్పుడు పలు కార్యక్రమాలకు హాజరయ్యేవాడు. ఆ కార్యక్రమాలకు అక్కడికి వచ్చే మహిళల ఆశ్లీల దృశ్యాలను చిత్రీకరించే వాడు. అలా తీసిన వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసేవాడు.ఈ నేపథ్యంలో ఓ యువతి ఫేస్బుక్ చూస్తుండగా అసభ్యంగా ఉన్న తన ఫొటో చూసి అవాక్కయ్యింది. దీంతో చెన్నై వెస్ట్‌జోన్ జాయింట్ కమిషనర్‌ను కలిసి దీనిపై ఫిర్యాదు చేసింది.యువతి ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన పోలీసులు మహ్మద్ గయాస్పై అనుమానం వచ్చి అరెస్టు చేశారు. అతని సెల్ ఫోన్ తనిఖీ చేయగా 50 ఏళ్లలోపున్న వంద మందికి పైగా మహిళల ఫొటోలు, వీడియోలు చిత్రీకరించి ఉన్నాయి. అందులో అతని తల్లి, పిన్ని, బంధువుల ఫొటోలు, వీడియోలు కూడా ఉండడం చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు.