మోదీని బలోపేతం చేస్తున్నకాంగ్రెస్ పార్టీ

మోదీని బలోపేతం చేస్తున్నకాంగ్రెస్ పార్టీ

పనాజీ : కాంగ్రెస్ పార్టీకి రాజకీయాల మీద శ్రద్ధ లేనందువల్ల ప్రధాని మోదీ మరింత శక్తిమంతుడు కాబోతున్నారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ దుయ్యబట్టారు. శనివారం విలేకరులతో మాట్లాడారు. ‘కాంగ్రెస్ పార్టీకి రాజకీయాల మీద శ్రద్ధ లేకపోవడం వల్ల ప్రధాని మోదీ బలపడుతున్నారు. ఆ పార్టీ గట్టి నిర్ణయాలు తీసుకోలేకపోతోంది. ఫలితంగా దేశం ఇబ్బందులు పడుతోంది. రాజకీయాల మీద కాంగ్రెస్ శ్రద్ధ చూపించనందున ఇప్పుడే అన్ని విషయాలు చెప్ప లేను. ఒకరు నిర్ణయాన్ని తీసుకోక పోవటం వల్ల దేశం ఎందుకు బాధపడాలి. గ్రెస్కు గతంలో ఓ అవకాశం వచ్చింది. అప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా పోరాడటానికి బదులు పశ్చిమ బెంగాల్లో టీఎంసీపై పోటీ చేసింది. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండాలని కోరుకుంటున్నా. భారత దేశ సమాఖ్య వ్యవస్థ పటిష్టంగా ఉండాలి. రాష్ట్రాలను బలోపేతం చేయాలని చెప్పారు. రాష్ట్రాలు బలంగా ఉంటేనే, కేంద్రం బలంగా ఉంటుంద’న్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos