కోల్‌కతా : పశ్చిమ బంగలో భాజపా నేతలను ఎదుర్కొనేందుకు మద్దతివ్వనున్నట్లు ఎన్సీపి నేత శరద్ పవర్ ముఖ్యమంత్రి మమతకు భరోసా ఇచ్చినట్లు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలు తెలిపారు. టీఎంసీ అభ్యర్థుల తరఫున ప్రచారంలో సైతం పాల్గొంటానని హామీ ఇచ్చారన్నారు.అంతకు ముందు బంగలో భారీ ర్యాలీని మమత ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్, శివసేన అధినేత సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో పాటు కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులను ఆహ్వానించనున్నట్లు తెలిసింది. బెంగాల్లో జేడీ నడ్డాపై దాడికి ప్రతిచర్యగా ముగ్గురు ఐపీఎస్ అధికారులపై కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించడం వివాదంగా మారింది. కేంద్ర నిర్ణయం అనంతరం.. అనేక మంది జాతీయ నేతలు మమతకు అండగా నిలిచి.. బీజేపీ తీరును తప్పుపట్టారు. మమత, పవార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి మంచి స్నేహం ఉన్న విషయం తెలిసిందే. గతంలో అనేకమార్లు బెంగాల్ ప్రభుత్వానికి పవార్ అండగా నిలిచారు