కోల్‌కతా: బెంగాల్‌ను వాళ్లు (బీజేపీ) అల్లర్లతో మంట బెట్టాలని చూస్తున్నారని పశ్చిమ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండి పడ్డారు. ‘రాజకీయంగా నన్ను టార్గెట్ చేశారు. అభిజిత్ బెనర్జీ కావచ్చు, అమర్త్యసేన్ కావచ్చు, వాళ్లంతా సమాజంలో వివిధ స్థాయిల్లో ఉన్నారు. మన విద్యావేత్తలను కూడా టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్లు (బీజేపీ) దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. ఇన్నేళ్లూ ఒక్కసారి కూడా నేతాజీ (సుభాష్ చంద్రబోస్) గురించి మాట్లాడ లేదు. ఇప్పుడు ఆయన గురించి మాట్లాడు తున్నారు. నూతన వ్యవసాయ చట్టాలు- అమానుష చట్టాలు. వెంటనే ఉపసంహరించుకోవాలి. ఈ విషయమై రైతులు చేస్తున్న ఆందోళనకు మా మద్దతు ఉంది. వారికి బాసటగా ఉంటామ’ని తెలిపారు.