బీర్భూమ్ హింసపై సీబీఐ దర్యాప్తులో బీజేపీ జోక్యం

కోల్కతా : బీర్భూమ్ హింసాకాండపై బీజేపీ నిజనిర్దారణ కమిటీ నివేదికను ఇవ్వటం సీబీఐ దర్యాప్తును బలహీన పరచడంతో పాటు, దర్యాప్తులో జోక్యం చేసుకోవడమే అవుతుందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు. బీర్భూమ్ ఘటనలో 8 మంది ప్రజలు సజీవదహనం కాగా, ఆ తర్వాత తీవ్రంగా గాయపడి ఒకరు మృతి చెందారు. మార్చి 21న రామ్పుర్హట్ సమీపంలోని బోగ్టుయి గ్రామంలో టీఎంసీ నేత భడు షేక్ హత్యానంతరం బీర్భూమ్ హింసాకాండ చోటుచేసుకుంది. దీనిపై బీజేపీ నిజనిర్ధారణ కమిటీ బుధవారం ఒక నివేదకను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు సమర్పించింది.ప్రభుత్వ మాఫియావల్లే బీర్భూమ్ ఘటన జరిగిందని బీజేపీ నిజనిర్దారణ కమిటీ పేర్కొనటాన్ని మమతా బెనర్జీ మండి పడ్డారు. నివేదికలో టీఎంసీ బీర్భూమ్ జిల్లా అధ్యక్షుడు అనుబ్రత మోండల్ పేరును ప్రస్తావించడం చాలా స్పష్టంగా బీజేపీ ప్రతీకార ధోరణిని చాటుతోందని ఆరోపించారు. విచారణ జరుగుతున్న సమయంలో ఏ రాజకీయ పార్టీ కూడా జోక్యం చేసుకోరాదన్నారు. వాళ్లు మా జిల్లా అధ్యక్షుడి పేరును ప్రస్తావించారు. ఇది కక్షసాధింపు ధోరణే. దర్యాప్తు పూర్తి కాకుండానే ఆయన పేరు ఎలా చెబుతారు? దానిని బట్టి చూస్తే అతన్ని అరెస్టు చేయాలని వారు కోరుకుంటున్నారు. ఇది పూర్తిగా వ్యక్తిగత కక్షే. వాళ్లు కుట్ర పన్నుతున్నారు అని మండి పడ్డారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos