కశ్మీర్ ఎప్పుడు రమ్మంటారు మాలిక్‌

కశ్మీర్ ఎప్పుడు రమ్మంటారు మాలిక్‌

న్యూఢిల్లీ: జమ్మూ-కశ్మీర్ పర్యటనకు ఎప్పుడు రావాలో తెలపాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఆ రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మాలిక్ కు బుధవారం ట్వీట్ చేసారు. ‘డియర్ మాలిక్ జీ. నా ట్వీట్ కు మీరిచ్చిన బలహీనమైన సమాధానాన్ని చూశాను. జమ్ము-కశ్మీర్ కు మీ ఆహ్వానాన్ని అంగీకరిస్తున్నా. ఎలాంటి షరతులు లేకుండానే వస్తా. జమ్ముకశ్మీర్ ప్రజలను కలుస్తా. నన్ను ఎప్పుడు రమ్మంటారు?’ అని ప్రశ్నించారు. చేశారు. ప్రత్యేక ప్రతిపత్తి రద్దు తర్వాత జమ్మూకశ్మీర్ లోని పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు జరుగుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని, ప్రధాని ఈ విషయమై దృష్టిసారించాలని రాహుల్ గాంధీ విన్నవించారు. దీన్ని సత్యపాల్ మాలిక్ ఖండించారు. తను పంపనున్న ప్రత్యేక విమానాల్లో స్వయంగా క్షేత్ర పర్యటనచేసి వాస్తవాల్ని గ్రహించాలని కోరారు. ఆ పనిని స్వేచ్ఛగా చేసే అవకాశాన్ని కల్పించాలని రాహుల్ బదులిచ్చారు. పర్యటనకు రాక ముందే రాహుల్ పలు షరతులు పెట్టారని మాలిక్ వ్యాఖ్యానించారు. విపక్షాలతో కలసి వచ్చి కశ్మీర్ అంశాన్ని రాహుల్ రాజకీయం చేయదలచారని వ్యాఖ్యానించారు. స్థానికుల్లో అస్థిరతను, అభద్రతా భావాన్ని మరింత ఎక్కువ చేసేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. దీనికి రాహుల్ చాలా ఘాటుగానే స్పందించారు. కశ్మీర్ లో ప్రస్తుత పరిస్థితులు ఎంత ప్రశాంతంగా ఉన్నాయో భారత టీవీ ఛానళ్లను చూసి రాహుల్ తెలుసుకోవాలని ఎద్దేవా చేశారు.ఎప్పుడు అక్కడికి రావాలో తెలపాలని ప్రశ్నించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos