హైదరాబాద్: మాయ మాటలతో మభ్యపెడుతున్న బీఆర్ఎస్ పాలనకు చరమగీతం పాడటానికి తెలంగాణ ప్రజలు ఆసిక్తితో ఎదురుచూస్తున్నారని ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. అల్వాల్లో జరిగిన కాంగ్రెస్ వాదుల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ను ఈసారి ప్రజలు గెలిపించడానికి సిద్ధమవుతున్నారన్నారు. నీళ్లు, నిధులు, నియమాకాల కోసం తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం కొందరికే బంగారు బాతుగా మారిందన్నారు. కోట్లాది రూపాయలను అప్పులు తెచ్చి సామా న్య ప్రజలపై రుద్దుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేస్తామని ఆయన ప్రజలు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయా పార్టీలకు చెందిన పలువురు పెద్ద ఎత్తున మైనంపల్లి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఒక ఐఖ్యమత్యంతో ఉండి కాంగ్రెస్ పార్టీతని భారీ మోజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు.