తెలంగాణలో ప్రియాంకరెడ్డి హత్య ఉదంతం దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది.ప్రియాంక హత్యాచారం అనంతరం ప్రియాంక తెరాస మంత్రులతో పాటు అన్ని పార్టీల నేతలు పరామర్శించారు.ఈ క్రమంలో ఇద్దరు మంత్రులు చేసిన వ్యాఖ్యలు విమర్శలకు తావిస్తోంది.హోంమంత్రి మహుమద్ అలీ,మరో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ప్రియాంకరెడ్డి తన సోదరికి ఫోన్ చేసే కంటే పోలీసులకు ఫోన్ చేసి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదన్నారు. అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందిస్తూ తెలంగాణ పోలీసులు క్రియాశీలంగా స్పందిస్తున్నారన్నారు. సీసీ కెమెరాలతో పోలీసులతో పర్యవేక్షిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కోట్లాది మంది ఉన్నారని పేర్కొంటూ ప్రతి ఇంటికి ఓ పోలీసును ఉంచలేం కదా? అని ఆయన వ్యాఖ్యానించడం వివాదాస్పదంగా మారింది.