మహేశ్ కు పుత్రికోత్సాహం..

  • In Film
  • March 20, 2019
  • 161 Views

ఎంత సూపర్‌ స్టార్‌ అయినా తండ్రి తండ్రే కదా.అందుకే తన కూతురు ప్రతిభను ప్రశసించకుండా ఉండలేకపోయాడు సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు.సినిమాల తరువాత కుటుంబంతో గడపడానికే అత్యంత ప్రాధాన్యత ఇచ్చే మహేశ్‌బాబు కుటుంబంతో కలసి తరచూ విదేశాలకు పర్యటనలు వెళ్లడం చూస్తూనే ఉంటాం.గౌతమ్‌తో పాటు తన కూతురు సితార ఫోటోలతో పాటు,సితార డ్యాన్స్‌ చేసే వీడియోలను మహేశ్‌,నమ్రతలు తమ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేస్తుండే విషయం తెలిసిందే.సితార ఫోటోలకు,డ్యాన్స్‌ వీడియోలకు అభిమానులతో పాటు సాధారణ నెటిజన్ల నుంచి కూడా మంచి స్పందన లభిస్తుంటుంది.ఈ క్రమంలో తాజాగా సితార బాహుబలి సినిమాలోని మురిపాల ముకుందా పాటకు డ్యాన్స్‌ చేస్తున్న వీడియోను మహేశ్‌బాబు తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసి వాట్‌ ఏ ట్యాలెంట్‌ మై సీత పాప అంటూ పోస్ట్‌ చేశాడు.మహేశ్‌ పోస్ట్‌ చేసిన ఈ వీడియో ట్విట్టర్‌లతో తెగ షేర్‌ అవుతోంది.అన్ని సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్‌గా మారగా మహేశ్‌ అభిమానులతో పాటు సాధారణ నెటిజన్లు ఇంతకు ముందులాగానే సితార డ్యాన్స్‌ వీడియోపై ప్రశసంలు కురిపిస్తున్నారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos