హైదరాబాద్: సూపర్‌స్టార్ మహేశ్‌బాబు అభిమానులకు శుభవార్త. సింగపూర్‌లోని ప్రతిష్ఠాత్మక మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మహేశ్ మైనపు విగ్రహాన్ని ప్రతిష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఆ విగ్రహాన్ని త్వరలో హైదరాబాద్‌కు తరలించనున్నారట. తెలుగు రాష్ట్రాల్లోని అభిమానుల కోసం మహేశ్ విగ్రహాన్ని ఇక్కడికి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ విగ్రహం హైదరాబాద్‌లో కేవలం ఒక్క రోజే ఉంటుంది. మహేశ్‌కు చెందిన ఏఎంబీ థియేటర్‌లో ఈ విగ్రహాన్ని ఉంచుతారు. ఫిబ్రవరి ఆఖరి వారంలో విగ్రహాన్ని ఇక్కడి తీసుకురానున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సింగపూర్ నుంచి హైదరాబాద్‌కు విగ్రహాన్ని తరలించే ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయట. ఒక్క రోజు ప్రదర్శన అనంతరం విగ్రహాన్ని మళ్లీ సింగపూర్‌కు తరలించి అక్కడి నుంచి లండన్‌లోని టుస్సాడ్స్ హెడ్‌క్వార్టర్స్‌కు పంపిస్తారు. ఈ విషయమై మహేశ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మహేశ్‌తో పాటు యంగ్ రెబెల్‌స్టార్ ప్రభాస్ మైనపు విగ్రహాన్ని కూడా టుస్సాడ్స్ సంస్థ బ్యాంకాక్ బ్రాంచ్‌లో రూపొందించింది. ప్రస్తుతం మహేశ్ ‘మహర్షి’ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయిక. తొలి షెడ్యూల్ చిత్రీకరణ పూర్తైంది. హైదరాబాద్‌లో రెండో షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఏప్రిల్‌లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.