న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం పై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు మహువా మొయిత్ర బుధవారం లోక్సభలో మరోసారి విరుచుకు పడ్డారు. ప్రభు త్వాన్ని ప్రశ్నించిన ప్రతిపక్ష నేతలపై సోషల్ మీడియా ట్రోల్ ఆర్మీలతో దాడి చేయిస్తోందని దుయ్యబట్టారు. పార్లమెంట్లో ఏ బిల్లును వ్యతిరే కించినా దేశ వ్యతిరేకులుగా ముద్రిస్తున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జాతీయ భద్రతా అంశాలపై అంగీకారం తెలుపకపోతే తామంతా దేశ వ్యతిరే కులం అవుతామా? అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఎలాంటి విచారణ లేకుండా ఓ వ్యక్తిని ఉగ్రవాదిగా ఎలా చిత్రీకరిస్తారని కేంద్ర ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోసారు. రాష్ట్రాల అధికారాలను జాతీయ భద్రతా బిల్లు కాలరాస్తోంద ఆక్రోశించారు. అది ప్రజలకు, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉందని మండి పడ్డారు. గతంలో కూడా ముందు ఆమె ఎన్డీయే ప్రభుత్వ విధానాలను తూర్పారబట్టారు.