న్యూఢిల్లీ: మహారాష్ట్రలో శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీల కలయికతో ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించ కుండా ఆదేశించాలని శుక్రవారం అత్యున్నత న్యాయస్థానంలో హిందూ మహాసభ నేత ప్రమోద్ జోషి వ్యాజ్యం దాఖలు చేసారు. ఎన్నికల తర్వాత పొత్తును ప్రజా వంచనగా పరిగణించాలని అందులో కోరారు. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన అమల్లో ఉంది. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని శుక్రవారం సాయంత్రం వారు గవర్నర్ను కోరనున్నారు.