శుక్రవారం ఉదయం 09:09 గంటలకు మహర్షి ఫస్ట్ సింగిల్..

  • In Film
  • March 27, 2019
  • 183 Views
శుక్రవారం ఉదయం 09:09 గంటలకు మహర్షి ఫస్ట్ సింగిల్..

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు నటించిన కొత్త చిత్రం మహర్షి మే9వ
తేదీన విడుదలకు ముస్తాబవుతుండడంతో చిత్ర బృందం చిత్రం ప్రమోషన్‌ కార్యక్రమాలు షురూ
చేసింది.ఈ క్రమంలో మార్చ్‌29వ తేదీన మహర్షి చిత్రం మొదటి పాట విడుదల చేయనున్నట్లు సంగీత
దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే.తాజాగా మొదటిపాట విడుదల
చేసే సమయాన్ని సూచిస్తూ దర్శకుడు వంశీ పైడిపల్లి ట్విట్టర్‌లో మహర్షి చిత్రంలోని ఒక
పోస్టర్‌ విడుదల చేశాడు.”మహర్షి మ్యూజికల్ జర్నీ మార్చ్ 29 వ తారిఖు ఉదయం 9 గంటల 09 నిముషాలకు స్టార్ట్ అవుతుంది.  #ఛోటీ ఛోటీ బాతేన్ అనే పాట తో మహేష్ బాబు.. పూజా హెగ్డే.. అల్లరి నరేష్ ల ఫ్రెండ్ షిప్ ను సెలెబ్రేట్ చేసుకునేందుకు రెడీ అవ్వండి.  దేవీశ్రీప్రసాద్ మ్యూజిక్.. శ్రీమణి సాహిత్యం.. కే యూ మోహనన్ ఛాయాగ్రహణం” అంటూ ట్వీట్ చేశాడు వంశీ. ఇక పోస్టర్ గురించి మాట్లాడుకుంటే… సముద్రం ఒడ్డున ఉన్న ఒక పచ్చటి కొండ అంచున మహేష్.. పూజా.. అల్లరి నరేష్ లు నిలబడి ఉన్నారు..మొదటి పాట ఎలా ఉందో తెలుసుకోవాలంటే మార్చ్‌ 29 ఉదయం తొమ్మిది గంటల
వరకు వేచి చూడాల్సిందే..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos