ఎన్నో అంచనాల మధ్య గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేశ్ బాబు కొత్త చిత్రం మహర్షి మొదటి రోజు అన్ని ఏరియాల్లో రికార్డు కలెక్షన్లు సాధించింది.తెలుగు చిత్రాల వసూళ్లలో కీలకపాత్ర పోషించే నైజాంలో బాహుబలి 1 రికార్డులను సైతం మహర్షి అధిగమించింది.నైజాంలో మొదటి రోజు బాహుబలి 2 చిత్రం రూ.8.96 కోట్లు సాధించగా బాహుబలి 1 రూ.6.29 కోట్లు సాధించింది.మహేశ్ నటించిన మహర్షి మొదటిరోజు నైజాంలో రూ.6.38 కోట్లు వసూళ్లు సాధించి బాహుబలి 2 అనంతరం అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డులు సృష్టించింది.ఇక సీడెడ్, గుంటూరు, ఈస్ట్‌వెస్ట్,నెల్లూరు,ఉత్తరాంధ్ర ఇలా అన్ని ఏరియాల్లో దుమ్ముదులిపే విధంగా కలెక్షన్లు సాధించిన మహర్షి మొదటిరోజే డిస్ట్రిబ్యూటర్లకు పెట్టుబడిలో సగం పెట్టుబడిని వెనక్కి తెచ్చినట్లు టాక్ వినిపిస్తోంది.లాంగ్ వీకెండ్‌తో పాటు పోటీలో మరే సినిమా లేకపోవడంతో శుక్ర,శని,ఆదివారాల్లో మహర్షి పెట్టుబడిని కూడా దాటి డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు పంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.మొత్తంగా మహర్షి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.24.6 కోట్లు వసూలు చేసింది.తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ల పరంగా చూస్తే మహర్షి ఐదవ స్థానంలో నిల్చుంది.రూ.42.87 కోట్ల షేర్‌తో బాహుబలి 2 మొదటి స్థానంలో నిలవగా రూ.26.60 కోట్లతో అరవింద సమేత రెండవ స్థానంలో రూ.26.36 కోట్లతో అజ్ఞాతవాసి రూ.26.03 కోట్లతో వినయ విధేయ రామ నాలుగవ స్థానంలో రూ.24.6 కోట్లతో మహర్షి ఐదవ స్థానంలో ఉన్నాయి..