పారిస్ : కాశ్మీర్ వివాదాన్ని భారత్, పాకిస్తాన్ దేశాలే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, మూడవ దేశం జోక్యం చేసుకో కూడదని ఫ్రెంచ్ అధ్య క్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రోన్ శుక్రవారం ఇక్కడ తెలిపారు. ఆ ప్రాంతంలో స్థిరత్వానికి అవసరమైన అన్ని చర్యలకు ఫ్రాన్స్ మద్దతు ఇస్తుం దన్నారు. ఏ ఒక్కరూ హింసా కాండను ప్రేరేపించ కూడదని హితవు పలికారు. ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా మాక్రోన్తో ప్రధాని మోదీ సుమారు గంటన్నర పాటు చర్చించారు.