జర్మన్ విద్యార్థి దేశ బహిష్కరణ

జర్మన్ విద్యార్థి దేశ బహిష్కరణ

చెన్నై: నూతన పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా నగరంలో జరిగిన ఆందోళనలో పాల్గొన్న జర్మనీకి చెందిన విద్యార్థి  -జాకబ్ లిం డెం తల్ని కేంద్ర ప్రభుత్వం దేశం నుంచి బహిష్కరించింది. ఇక్కడ ఐఐటీలో భౌతిక శాస్త్రంలో స్నాతకోత్తర విద్యన భ్య స్తు న్న జాకబ్ లిండెంతల్ గత వారంలో నిరసనల్లో పాల్గొన్నాడు. ఇది వీసా నిబంధనలకు వ్యతిరేకమైనందున తనంతట తాను ఇండి యాను వదిలి వెళ్లక పోతే దేశ బహిష్కరణ అనివార్యమని వలస విభాగం అధికారులు హెచ్చరించారు. దరిమిలా సోమ వారం మధ్యాహ్నం చెన్నై నుంచి బయలుదేరి ఆమ్ స్టర్ డామ్ కు వెళ్లిపోయాడు. తర్వాత తన బహిష్కరణ పై జాకబ్ స్పందించారు. ‘నేను సీఏఏ కు వ్యతిరేకంగా ఎలాంటి అభిప్రాయాన్నీ వ్యక్తం చేయలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. మిత్రులతో కలిసి చేపక్, వళ్లువర్ కొట్టమ్ ప్రాంతాలకు వెళ్లాను. భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రవర్తించ లేదు. నాకు విధించిన శిక్ష గురించి న్యాయ నిపుణులను సంప్రదించి తదుపరి చర్యల్ని తీసుకుంటాన’ని వివరించారు. జాకబ్ బహిష్కరణపై ఐఐటీ ఇంకా స్పందించాల్సి ఉంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos