దశాబ్ద కాలంగా తెలుగు చిత్రాలపై జాతీయస్థాయిలో ఆసక్తి,చర్చలు పెరిగాయి.మగధీర సినిమాతో తెలుగు మొదలైన తెలుగు చిత్రాల హవా అనంతరం పెరుగూత పోయి బాహుబలి చిత్రాల అనంతరం తెలుగు చిత్ర పరిశ్రమ హిందీ చిత్ర పరిశ్రమకు ధీటుగా ఎదిగింది.తెలుగు సినిమా ఇంత ఎత్తుకు ఎదిగిందంటే అందుకు రాజమౌళి సినిమాలే ప్రధాన కారణమని అందులోనూ బాహుబలి సినిమానే కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.బాహుబలి స్పూర్తితో తెలుగులో భారీ బడ్జెట్ సినిమాలు తెరకెక్కడం మొదలైంది.ఈ క్రమంలో స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాథ ఆధారంగా చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న సైరా నరసింహారెడ్డి కూడా దాదాపుగా రూ.200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోంది.బాహుబలి సినిమా తరువాత తెలుగు చిత్రాలకి ఇతర భాషల్లో పెరిగిన ఆదరణతో ‘ఉయ్యాలవాడ’ విషయంలో రిస్క్ చేశారు. అయితే బాహుబలి రేంజ్ లో ఇతర భాషల వారి దృష్టిని ఆకర్షించడంలో ‘సై రా’ ఇంతవరకు సక్సెస్ కాలేదనే చెప్పాలి.ఈ సినిమా టీజర్ లో ఎలాంటి ప్రత్యేకతలు లేకపోవడంతో జనాలకు అనుకున్న స్థాయిలో రీచ్ అవ్వలేదు. టాలీవుడ్ లోనే ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు ఇక ఇతర భాషల్లో బజ్ ఎలా క్రియేట్ చేస్తారు. అక్టోబర్ 2న సినిమాను విడుదల చేయాలని నిర్ణయించిన క్రమంలో ఈ సినిమాపై బజ్ పెంచడం ఎలా అనేదానిపై నిర్మాత చరణ్ ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది.భారీ బడ్జెట్ సినిమాలకు ప్రీరిలీజ్ బజ్ ఓ రేంజ్ లో ఉంటేనే ఓపెనింగ్స్ బాగా వస్తాయి. ఇక హిట్ టాక్ వస్తే.. భారీ వసూళ్లు సాధించడానికి తోడ్పడుతుంది. ఇప్పటినుండి ప్రమోషన్స్ పై దృష్టి పెట్టకపోతే గనుక ఇతర భాషల సంగతి తరువాత ముందు టాలీవుడ్ లో కూడా జనాలకు ఈ సినిమాపై ఆసక్తి సన్నగిల్లడం ఖాయం!