ఇది కాషాయ ధౌర్జన్యం

ఇది కాషాయ ధౌర్జన్యం

ప్రయాగ్ రాజ్: మనింటికి మన అనుమతి లేకుండా రంగు వేస్తే ఊరుకుంటామా? కానీ ఇక్కడ ఊరుకోవాల్సిందే. ఎందు కంటే ఆ పని చేసింది సాక్షాత్తు సచివుడు. ఇక్కడ రాష్ట్ర మంత్రి నంద గోపాల్ నంది నివాసముంటున్న వీధిలోని అన్ని ఇళ్లకూ భాజపా కార్యకర్తలు కాషాయ రంగు పూసారు. ఇళ్ల గోడలపై మతానికి చెందిన చిహ్నాలను చిత్రీకరించారు. దీన్ని ప్రశ్నించినా వాళ్లు పట్టించుకోలేదు. పౌరులు వద్దంటున్నా వారి ఇళ్ల గోడలకు కాషాయ రంగు స్ప్రే చేసారు. వారిని బలంగా అడ్డుకున్న వ్యాపారి రవి గుప్తాను బుతూలు తిట్టారు. చంపేస్తామని బెదిరించారు. ఆయన కుంటుబ సభ్యులనూ వదల్లేదు. దీంతో ఆగ్రహానికి గురైన రవి గుప్తా ఆధారాలతో సహా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. రంగులు వేస్తున్నప్పుడు తీసిన వీడియోను కూడా పోలీసులకు అప్పగించారు. మరోక వ్యక్తి కూడా కేసు నమోదు చేశారు. ఈ ఫిర్యాదులపై విచారణ చేస్తున్నామని పోలీసులు ఫిర్యాదు దార్లను భివృద్ధి నిరోధకులుగా మంత్రి నందగోపాల్ అభివర్ణించటం గమనార్హం. ‘కొందరు నాయ కులుగా ఎదిగేందుకే ఇలా చేస్తున్నారు. ఒక్క తమ వీధిలోనే కాదు ప్రయాగ్ రాజ్ నగరమంతా కాషాయ రంగు వేస్తామ’ని చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos