ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 390 పాయింట్లు కోల్పోయి 57,235కి పడిపోయింది. నిఫ్టీ 109 పాయింట్లు నష్టపోయి 17,014కి దిగజారింది. హెల్త్ కేర్, మెటల్ సూచీలు మినహా మిగిలిన అన్ని సూచీలు నష్టాలను మూటకట్టుకున్నాయి. సెన్సెక్స్ లో హెచ్సీఎల్ టెక్నాలజీస్ (3.19%), సన్ ఫార్మా (1.30%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (0.37%), డాక్టర్ రెడ్డీస్ (0.23%), అల్ట్రాటెక్ సిమెంట్ (0.08%) అధిక లాభాల్ని గడించాయి. విప్రో (-7.03%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-2.36%), ఎల్ అండ్ టీ (-1.85%), ఐసీఐసీఐ బ్యాంక్ (-1.60%), ఏసియన్ పెయింట్స్ (-1.12%) నష్ట పోయాయి.