ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో మునుగుతోంది. వ్యాపార ఆరంభంలో లాభాలను నమోదు చేసిన సూచీలు కొద్ది సేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. గంట కిందట బీఎస్ఈ-సెన్సెక్స్ 60 పాయింట్లకుపైగా నష్టంతో 48,625 వద్ద, ఎన్ఎస్ఈ-నిఫ్టీ 30 పాయింట్లకుపైగా తగ్గి 14,665 వద్ద ఉన్నాయి. ఐటీ, ఆటో షేర్లు నష్టాల్లో ప్రధానంగా ఉన్నాయి. ఎఫ్ఎంసీజీ, ఫార్మా షేర్లు కాస్త సానుకూలంగా స్పందిస్తున్నాయి. ఏషియన్ పెయింట్స్, ఐటీసీ, డాక్టర్ రెడ్డీస్, నెస్లే, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు లాభాల్లో, టీసీఎస్, టెక్ మహీంద్రా, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్సీఎల్టెక్ నష్టాల్లో ఉన్నాయి.