ముంబై : స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాలతో ఆరంభమయ్యాయి. ఉదయం 9:42 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ ప్రస్తుతం 316 పాయింట్ లు పతనమై 38,299, ఇక నిఫ్టీ 82 పాయింట్ల నష్టంతో 11,326 వద్ద ఉన్నాయి. బుధవారం అమెరికా మార్కెట్లు నీరసించాయి. ప్రస్తుతం ఫ్యూచర్స్ డీలాపడ్డాయి. ఆసియాలోనూ అమ్మకాలు ఊపందుకోవడంతో సెంటిమెంటు బలహీనపడినట్లు నిపుణుల మదింపు. డెరివేటివ్స్లో టాటా పవర్, టాటా కెమ్, ఈక్విటాస్, ఎంజీఎల్, ఐజీఎల్, గ్లెన్మార్క్, పీవీఆర్, లుపిన్, అశోక్ లేలాండ్, కేడిలా, అరబిందో 4.4-1.3 శాతం మధ్య ఎగశాయి. ఇతర కౌంటర్లలో ముత్తూట్, పెట్రోనెట్, సెయిల్, అమరరాజా, మదర్సన్ సుమీ, ఐడీఎఫ్సీ ఫస్ట్, అదానీ ఎంటర్, మణప్పురం 3.5-1.3 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 0.3 శాతం వెనకడుగు వేసింది.