మార్కెట్లకు భారీ నష్టాలు

మార్కెట్లకు భారీ నష్టాలు

ముంబై: దేశీయ మార్కెట్ల వ్యాపారాలు సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. లాక్డౌన్ ఈ నెల 17 వరకు కేంద్రం పొడిగించటం దీనికి కారణంగా భావిస్తున్నారు. ఉదయం 9:45 గంటల సమయంలో సెన్సెక్స్ 1,544 పాయింట్లు దిగజారి 32,154 వద్ద, నిఫ్టీ 451 పాయింట్లు కోల్పోయి 9,047 వద్ద ఉన్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.33 వద్ద ఆగింది. జియో ప్లాట్ఫామ్స్లో;సిల్వర్ లేక్ పెట్టుబడులు పెట్టనుందన్న వార్తతో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్లు ఓ దశలో 1.76 శాతం కుంగింది. సిప్లా, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ షేర్లు లాభాల్ని గడించాయి. వేదాంత, హిందాల్కో ఇండస్ట్రీస్, టాటా మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు భారీ నష్టాల్ని చవి చూసాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos