ముంబై : దేశీయ మార్కెట్లు సోమవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.50 గంటలకు సెన్సెక్స్ 582 పాయింట్లు నష్టపోయి 30,576 వద్ద, నిఫ్టీ 170 పాయింట్లు దిగజారి 8,941 వద్ద ఆగాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 75.65 వద్ద ఆగింది. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, భారతీ ఎయిర్టెల్, ఇన్ఫోసిస్, సిప్లా, ఎల్ అండ్ టీ, టాటా కన్సల్టెన్సీ, యూపీఎల్ షేర్లు లాభాల్ని గడించాయి. జీ ఎంటర్టైన్మెంట్, బజాజ్ ఫినాన్స్ లిమిటెడ్, టైటాన్ కంపెనీ, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతీ సుజుకీ, ఓఎన్జీసీ షేర్లు భారీగా నష్ట పోయాయి.