ముంబై : స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాలతో వ్యాపారాల్ని ఆరంభించాయి. ఉదయం 9:51 గంటలకు సెన్సెక్స్ 525 పాయింట్లు లాభపడి 30,592 వద్ద, నిఫ్టీ 155 పాయింట్లు ఎగబాకి 8,948 వద్ద ఆగాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.48 వద్ద నిలిచింది. గెయిల్, సిప్లా, హెచ్యూఎల్, మహీంద్రా అండ్ మహీంద్రా, సన్ ఫార్మా, బ్రిటానియా, వేదాంత, హెచ్డీఎఫ్సీ, హీరో మోటోకార్ప్, హెచ్సీఎల్ టెక్ షేర్లు లాభాల్ని గడించాయి. యాక్సిస్ బ్యాంక్, టీసీఎస్, ఐటీసీ లిమిటెడ్, ఇండ్ ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ షేర్లు నష్టాల పాలయ్యాయి.