ముంబై: స్టాక్ మార్కెట్లు గురువారం కూలి పోయాయి. సెన్సెక్స్ 463 పాయింట్లు పతనమై 37,018 వద్ద, నిఫ్టీ 138 పాయింట్ల నష్టంతో 10,980 వద్ద స్థిర పడ్డాయి. డాలర్తో రూపాయి మారకం విలువ 69.08గా కొనసాగుతోంది. ఎన్ఎస్ఈలో వేదాంత, జేఎస్డబ్ల్యూ స్టీల్, హిందాల్కో, ఎస్బీఐ, టాటామోటార్స్ షేర్లు భారీగా నష్టపోయాయి. విప్రో, భారతీ ఇన్ఫ్రాటెల్, మారుతి సుజుకీ, రిలయన్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు స్వల్పంగా లాభపడ్డాయి. సెన్సెక్స్ 450 పాయింట్లు, నిఫ్టీ 11 వేల కిందకు పడిపోయాయి. ఆటో, లోహ, ఐటీ, ఫార్మా, బ్యాంకింగ్, మౌలిక రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో 200 పాయింట్లకు పైగా నష్టంతో ట్రేడింగ్ను ఆరంభమైంది. సెన్సెక్స్ అంతకంతకూ దిగజారింది. చివరి గంటల్లో ఏకంగా 700 పాయింట్లకు పైగా నష్టంతో ముగిసింది. నిఫ్టీ కూడా 200 పాయింట్లకు పైగా దిగజారింది. చివరకు కాస్త కోలుకున్నా భారీ నష్టాలు తప్పలేదు. బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, ఉక్కు, సిమెంటు, విద్యుత్ రంగాల వృద్ధి మందగించటం మార్కెట్ను ప్రభావితం చేసింది. పోయాయి.