న్యూఢిల్లీ: మోటర్ వాహనాల నిబంధనలు ఉల్లంఘించిన వాహ నాలపై భారీగా జరిమానాలు విధించడానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా లారీలు సెప్టెంబర్ 19 న సమ్మె కట్టనున్నాయి. ఇందుకు ఆల్ ఇండియా మోటర్ ట్రాన్స్ పోర్ట్ కాంగ్రెస్ పిలుపు నిచ్చింది. ఆందోళనలో తామూ పాల్గొంటామని తమిళనాడు ఫుడ్, ఆయిల్ అండ్ ట్యాంకర్ లారీ ఓనర్స్ అసోసియేషన్ తెలిపింది. సెప్టెంబర్ 19 న ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ లారీలు ఎక్కడివి అక్కడే ఆగి పోతాయి.