నిరసిస్తే దేశద్రోహం కేసు

నిరసిస్తే దేశద్రోహం కేసు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేసే వారిపై కేసులు పెట్టడం రాజ్యాంగంలోని వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడమేనని సు ప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ మదన్ బీ లోకూర్ వ్యాఖ్యానించారు. ఒడిశా డైలాగ్స్ అనే సంస్థ ఆధ్వర్యంలో మధు బాబు తొలి స్మారకోపన్యాసం చేసారు. ‘దేశ ద్రోహం కేసులు ఇటీవల గణనీయంగా పెరిగిపోతున్నాయి. ప్రసంగాల కు సంబంధించి ఇటీవల దేశద్రోహం కేసుల నమోదు తీవ్రస్థాయిలో పెరిగింది. దేశద్రోహమన్నది చాలా తీవ్రమైన అభియోగం. గతంలో గాంధీజీ, తిలక్లపై దేశద్రోహం కేసులు దాఖలయ్యాయి. ఇప్పుడు సామాన్యులపై కూడా ఈ కేసులు పెడుతున్నారు. ‘యూపీలోని హాథ్ర్సలో ఒక యువతిపై కొందరు గ్యాంగ్రేప్ నకు పాల్పడి, హత్యచేసిన నేపథ్యంలో 23మం దిపై 22దేశ ద్రోహం కేసులు పెట్టారు. గ్యాంగ్ రేప్, హత్య ఘటనను నిరసించిన కారణంగా పై వారిపై దేశ ద్రోహం కేసు నమోదు చేయవచ్చా?’ అని ప్రశ్నించా రు. ‘న్యాయ వ్యవస్థ మొద ట తన పనితీరును చక్కదిద్దుకోవాలి. న్యా యమూర్తుల నియామకాలలో ఏళ్ల తరబడి జాప్యం జరుగుతోంది. హైకోర్టుల పోస్టులలో 40 శాతం, విచారణ న్యాస్థానాల్లో 20 శాతం ఖాళీ. మనం సక్రమంగా పని చేస్తున్నామో లేదో ఆత్మవిమర్శ చేసుకోవాల’ని హితవు పలికారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos