న్యూ ఢిల్లీ : అత్యున్నత న్యాయస్థానం మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ని కేంద్రం రాజ్యసభ సభ్యుడుగా నియమించటం న్యాయ వ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీస్తోందని అత్యున్నత న్యాయ స్థానం మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ లోకూర్ వ్యాఖ్యానించారు.ఆయనతో పాటు పలువురు న్యాయమూర్తులు దీనిపై అసంతృప్తిగా ఉన్నారు. తాను రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణాన్ని చేసిన తర్వాత అందుకు గల కారణాల్ని వివరిస్తానని రంజన్ గోగయ్ పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు ఇచ్చినందుకే గొగోయ్ను రాజ్యసభకు నామినేట్ చేశారమే విమర్శలూ వినిస్తున్నాయి. అయోధ్య భూ వివాదం, రాఫెల్ కేసులో కేంద్ర ప్రభుత్వం చాలా నిజాయితీగా, పారదర్శకంగా వ్యవహరించిందని యోగ్యతా పత్రాన్ని ప్రసాదించిన ధర్మాసనానికి గొగొయే నేతృత్వం వహించటం తెలిసిందే.