లోకేశ్ స్థానం మంగళగిరి

లోకేశ్ స్థానం మంగళగిరి

అమరావతి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేశ్ శాసన సభ ఎన్నికల్లో గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి పోటీ చేయనున్నారు. ఆయనను విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని మొదట్లో అనుకున్నా, ఆ స్థానాన్ని చాలా మంది ఆశిస్తున్నందున మంగళగిరికి మార్చాలని చంద్రబాబు నిర్ణయించారు. గత ఎన్నికల్లో ఈ స్థానంలో వైకాపా అభ్యర్థి ఆళ్ల రామకృష్ణా రెడ్డి, తెదేపా అభ్యర్థిపై కేవలం 12 ఓట్ల తేడాతో గెలుపొందారు. నామినేషన్ల ఘట్టం సమీపిస్తుండడంతో అభ్యర్థులను ఖరారు చేసే పనిలో చంద్రబాబు తలమునకలుగా ఉన్నారు. మరో వైపు ఒంగోలు లోక్‌సభ స్థానం నుంచి మంత్రి సిద్ధా రాఘవరావును పోటీ చేయించాలని చంద్రబాబు దాదాపుగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న దర్శి శాసన సభ స్థానాన్ని ఇటీవల తెదేపాలో చేరిన ఉగ్ర నరసింహారెడ్డి కేటాయించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos