రేపు 58 లోక్సభ స్థానాలకు పోలింగ్

రేపు 58 లోక్సభ స్థానాలకు పోలింగ్

న్యూ ఢిల్లీ : లోక్సభ ఎన్నికల ఆరో దశ పోలింగ్ శనివారం జరగనుంది. ఎనిమిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుండి 58 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుంది. ఈ రాష్ట్రాల నుంచి 889 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. ఆరో దశలో ఉత్తరప్రదేశ్లో 14, బీహార్లో ఎనిమిది, హర్యానాలో పది, ఢిల్లీలో ఏడు, పశ్చిమ బెంగాల్లో ఎనిమిది, జార?ండ్లో నాలుగు, ఒరిస్సాలో ఆరు స్థానాలకు పోలింగ్ జరగనుంది. అయితే మూడో దశ (మే 6)లో జరగాల్సిన జమ్మూకాశ్మీర్ లోని అనంతనాగ్ లోక్సభ నియోజకవర్గం పోలింగ్, మే 25 ఆరో దశ పోలింగ్ కు మార్చారు. జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ, హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టర్, కాంగ్రెస్ నేతలు కన్నయ్య కుమార్, దీపేందర్ సింగ్ హుడా, బిజెపి నేత మనోజ్ తివారీ తదితరలు బరిలో ఉన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos