న్యూ ఢిల్లీ : టీడీపీ యువనేత నారా లోకేశ్ గుర్తు తెలియని చోట దాక్కున్నారంటూ వైసీపీ నేతలు చేసిన ఆరోపణలకు లోకేశ్ ఘాటుగా స్పందించారు. తాను ఎక్కడికీ పోలేదని ఆయన చెప్పారు. తాను ఇప్పుడు హోటల్ మౌర్యలో ఉన్నానని తెలిపారు. 50 అశోక రోడ్డులోని ఎంపీ గల్లా జయదేవ్ నివాసంలో కూడా ఉన్నానని చెప్పారు. అప్పుడప్పుడు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కార్యాలయానికి కూడా వెళ్తున్నానని వెల్లడించారు. సీఐడీ అధికారులు ఇంతవరకు తన వద్దకు రాలేదని… వాళ్లు వచ్చి నోటీసులు ఇస్తే తీసుకుంటానని తెలిపారు. దాక్కునే అలవాటు తనకు లేదని చెప్పారు. తాను ఢిల్లీకి వచ్చినప్పటి నుంచి ఎక్కడ ఉంటున్నానో అందరికీ తెలుసని.. కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రచారాన్ని ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు.