రూ.12 వేల కోట్ల ప్రజాధనం దోపిడీ

రూ.12 వేల కోట్ల ప్రజాధనం దోపిడీ

అమరావతి: గ్రామ వాలంటీర్ల నియామకంలో వైకాపా రూ.12 వేల కోట్ల ప్రజాధనాన్ని దోచుకుంటోందని తెదేపా నేత, మాజీ మంత్రి నారా లోకేష్ సోమవారం ట్విట్టర్లో ఆరోపించారు. వైకాపా నేత విజయ సాయి రెడ్డి పార్టీ కార్యకర్తలతో మాట్లాడిన వీడియోను లోకేష్ ట్విట్టర్కు జత చేసారు.అందులో విజయ సాయి రెడ్డి.. గ్రామ వాలంటీర్ వ్యవస్థను, వైకాపా తరపున సామాజిక మాధ్య మాల్లో కష్ట పడిన వారి కోసం తీసుకొచ్చినట్లు అని అర్థ మొ చ్చే లా  పేర్కొన్నారు. ‘జగన్ స్కామ్ స్టార్ అని మరోసారి ఆధారాలతో రుజువైంది. గ్రామ వాలంటీర్ల స్కామ్ తో 12 వేల కోట్ల ప్రజా ధనం దోపిడీకి తెర లేపారు. రాజకీయాలకు అతీతంగా గ్రామ వాలంటీర్ల నియామకం అని జగన్ గారు ఆస్కార్ రేంజిలో నటిస్తుంటే, కడుపులో దాచుకో లేక  వైసీపీ స్కామ్ ని దొంగలెక్కల వీరుడు బయటకి కక్కేశార’ని విమర్శించారు.”వాలంటీర్ల నియామకంలో కులం, మతం చూడ లేదు వైసీపీ కార్యకర్తా? కాదా? అని మాత్రమే చూసాం అని స్వయంగా ప్రకటి స్తున్నారు. నాలుగు లక్షల మంది వైకాపా నిరుద్యోగులకు ఉద్యో గాలు ఇచ్చుకోవడానికి 10 లక్షల మంది ఉద్యోగాలు తీసేసి వారి పొట్ట కొట్టే భారీ కుట్రే వైకాపా వాలంటీర్ల స్కీం. అని ఆరోపించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos