లఖ్నవ్: రాష్ట్రీయ లోక్దళ్ జాతీయ అధ్యక్షుడిగా ఆ పార్టీ ఉపాధ్యక్షుడు జయంత్ చౌధరీ మంగళవారం ఎన్నికయ్యారు. పార్టీ అధ్యక్షుడైన అజిత్ సింగ్ ఇటీవల కరోనా కారణంగా మృతి చెందటం వల్ల ఆయన స్థానంలో అతని కుమారుడు బాధ్యతలు చేపట్టారు. జాతీయ అధ్యక్షుడిగా చౌధరీ పేరును ప్రధాన కార్యదర్శి అయిన త్రిలోక్ త్యాగీ ప్రతిపాదించారు. సీనియర్ నేత మున్షిరామ్పాల్ సహా పార్టీ నేతలు సమర్థించారు. జయంత్ చౌధరీ లోక్సభ సభ్యుడిగా పనిచేశారు. జయంత్ తండ్రి అజిత్ సింగ్ కేంద్ర మంత్రిగా సేవలు అందింరు. ఆరు సార్లు బాగ్పట్ నియోజక వర్గానికి లోక్సభలో ప్రాతినిధ్యాన్ని వహించారు.